Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eternal Bride: నిత్య పెళ్లి కూతురు.. చేసేది పోలీస్ ఉద్యోగం.. యువకులను ట్రాప్ చేసి వివాహం.. మరో పెళ్లికి సిద్దపడటంతో వెలుగులోకి!

మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో యువకుడితో వివాహనికి సిద్ధమవుతున్న మహిళా శిఖామణి వ్యవహారం బయటపడింది.

Eternal Bride: నిత్య పెళ్లి కూతురు.. చేసేది  పోలీస్ ఉద్యోగం.. యువకులను ట్రాప్ చేసి వివాహం.. మరో పెళ్లికి సిద్దపడటంతో వెలుగులోకి!
Woman Police Marrying Men With Cheating
Follow us
Balaraju Goud

|

Updated on: May 18, 2021 | 4:25 PM

Hyderabad Woman Police: నిత్య పెళ్లి కూతురు.. అవును నిజమండీ.. ఇప్పటి వరకు రెండుకు మించి వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుల గురించి విన్నాం. తాజాగా మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో యువకుడితో వివాహనికి సిద్ధమవుతున్న మహిళా శిఖామణి వ్యవహారం బయటపడింది. సైబర్ కేటుగాళ్లు.. నేరగాళ్లు హనీ ట్రాప్ చేయడం సాధారణంగా చూస్తూనే ఉన్నాం. కానీ హైదరాబాద్‌లో ఓ ఏఆర్ మహిళ కానిస్టేబుల్.. అబ్బాయిలకు ఎర వేస్తోంది. నేరగాళ్లను పట్టుకోవాల్సిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి డబ్బున్న కుర్రాలను టార్గెట్ చేసి దోచుకుంటోంది. ఏకంగా ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఆమెగారి పెళ్లిళ్ల బాగోతాన్ని గుర్తించిన యువకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంధ్య రాణి.. ఇది వరకే ముగ్గురిని పెళ్లి చేసుకుంది. వారిలో ఇద్దరికి విడాకులు ఇచ్చి పంపించింది. మూడో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్యారాణి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజను ఈ కిలాడీ కానిస్టేబుల్ ట్రాప్ చేసింది. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను.. ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుంది. కొద్ది రోజులు అయ్యాక పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని.. కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోస్ బయటపెడతానని బెదిరింపులకు దిగింది.

గతంలో వివాహాల విషయం చెప్పకుండానే చరణ్‌ను నమ్మించి పెళ్లిచేసుకుంది. తరువాత విషయం తెలుసుకున్న బాధితుడు.. శంషాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ సంధ్య రాణి చెర నుంచి తనను రక్షించాల్సిందిగా.. శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.

ఒంటరిగా ఉన్న అబ్బాయిలను.. ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందని బాధితుడు ఆరోపించాడు. సంధ్య రాణి బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరాడు. సంధ్య రాణిని డిపార్ట్‌మెంట్ నుంచి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.

గతంలో సంధ్య రాణి వరస పెళ్లిళ్లపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉద్యోగం అండతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తోందని స్వయంగా తల్లిదండ్రులే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని.. వారితో గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పైగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే అడ్డుపెట్టుకుని అబ్బాయిలకు వల వేస్తున్నట్టు తేలింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  CORONA: క‌రోనా చైన్‌ను బ్రేక్ చేస్తే జ‌రిగే మేలు ఇదే.. హైద‌రాబాద్ పోలీసులు ఎంత చ‌క్క‌గా వివ‌రించారో చూడండి..