చైన్ స్నాచర్లను పట్టించిన సీసీటీవీ కెమెరాలు.. వలపన్ని పట్టుకున్న నర్సంపేట పోలీసులు
Chain snatchers Arrested: చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. వరంగల్ జల్లా నర్సంపేటలో ఈ ఘటన జరిగింది. ఈజీ మనీకి అలవాటుపడిన నలుగు యువకులు
చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. వరంగల్ జల్లా నర్సంపేటలో ఈ ఘటన జరిగింది. ఈజీ మనీకి అలవాటుపడిన నలుగు యువకులు చోరీలకు పల్పడుతున్నారు. ఇక ఈస్ట్ జోన్ డి.సి.పి వెంకటలక్ష్మీ అందించిన సమాచారం మేరకు…. ఈ నెల 10వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో నర్సంపేట పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న జయలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో ఆమె నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైన్‌స్నాచింగ్ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
అయితే.. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. పాకాల రోడ్డులో ఇదే తరహాలో చైన్‌స్నాచింగ్ జరిగింది. ఓ ఇద్దరు యువకులు ఈ చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులు మరో రోజు ఇదే తరహాలో చోరీ చేసేదుకు పాకాల రోడ్డు ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సమాచారం రావడంతో నర్సంపేట ఎస్.ఐ నవీన్ కుమార్ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించడంతో నిందితులు మహిళ మెడలో గోలుసు చోరీ చేసిన వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 25 గ్రాముల బంగారం గొలుసు, రూ. 52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగసోత్తును తమ ఉంచుకున్నందుకుగాను మరో ఇద్దరిని నర్సంపేట పోలీసులు అరెస్టు చేసారు.
ఇక వీరు చోరీ చేసిన నగలను వరంగల్‌లోని ఓ ఫైనాన్స్ సంస్థలో తనాఖా పెట్టి 70వేల రూపాయలకు అప్పుగా తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. అప్పుగా తీసుకున్న నగదును నిందితులు వాటా వారిగా పంచుకోని కొద్ది మొత్తాన్ని నిందితులు జల్సాలు చేసినట్లుగా నిందితులు అంగీకరించారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులను రాయప్రోలు చింటు(గీసుకొండ మండలం), దరాంగుల ప్రవీణ్(నర్సంపేట), అలకుంట శ్రీను(నర్సంపేట), బొంత కొమురయ్య(ఐనవోలు మండలం)గా గుర్తించారు.
నిందితులను సకాలంలో అరెస్టు చేసిన బంగారు గొలుసు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఎ.సి.పి కరుణాసాగర్ రెడ్డి, ఎస్.ఐ నవీన్ కుమార్, ఎ.ఎస్.ఐ రాజేందర్, కానిస్టేబుల్ సీతరామరాజును వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అభినందించారు.
ఇవి కూడా చదవండి: కోవిడ్ 19 తో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె.కె. అగర్వాల్ మృతి, పలువురు ప్రముఖుల సంతాపం