AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రంగా తయారవుతోంది… ఎక్సైజ్ రిటైర్డ్ కమిషనర్ చంద్రవదన్ కామెంట్స్…

హైదరాబాద్ డ్రగ్స్‌ వాడకానికి కేంద్ర బిందువుగా తయారవుతోందని రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. డ్రగ్స్ మాఫియా పకడ్బందీగా హైదరాబాద్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆరోపించారు.

హైదరాబాద్ డ్రగ్స్‌కు కేంద్రంగా తయారవుతోంది... ఎక్సైజ్ రిటైర్డ్ కమిషనర్ చంద్రవదన్ కామెంట్స్...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 20, 2020 | 3:04 PM

Share

హైదరాబాద్ డ్రగ్స్‌ వాడకానికి కేంద్ర బిందువుగా తయారవుతోందని రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… డ్రగ్స్ మాఫియా పకడ్బందీగా హైదరాబాద్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆరోపించారు. హై ప్రొఫైల్ ఉండే వ్యక్తులే డ్రగ్స్ కు ఎక్కువగా బానిసలు అవుతున్నారని వివరించారు. అయితే, 30 వరకు హై ప్రొఫైల్ గ్యాంగ్‌లు హైదరాబాద్లో డ్రగ్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ మాఫియాకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల నుంచి సపోర్డ్ లభిస్తోందని, వారి అండదండలు చూసే డ్రగ్స్ మాఫియా నగరంలో రెచ్చిపోతోందని అన్నారు. డ్రగ్ వినియోగదారులను కాకుండా అమ్మేవారిపై నిఘా పెడితే డ్రగ్ మాఫియా‌ను అరికట్టవచ్చని సూచించారు.

న్యూ ఇయర్ నేపథ్యంలో…

రానున్న నూతన సంవత్సర వేడుకలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే సిటీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను డంప్ చేశారని అన్నారు. నగరంలో పార్టీలు జరిగే ప్రాంతాలను ఎంచుకొని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే డ్రగ్స్‌ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. న్యూ ఇయర్ భారీ డిస్కౌంట్ అంటు సోషల్ మీడియా వేదికగా డ్రగ్ విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే మాదక ద్రవ్యాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారానికి చెక్ పెట్టాలంటే కఠినమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలని సూచించారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్