ఐటీ ఉద్యోగినికి వేధింపులు.. గూగుల్‌లో ఆమె పేరుపై పోర్న్ సైట్స్..!

హైదరాబాద్‌‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్ల వలలో పడింది. ఆమెను టార్గెట్ చేయడంతో.. మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఎవరో తెలుసుకునే పనిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది. ఉప్పల్‌‌కు చెందిన 33 ఏళ్ల ఒక మహిళ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటి లాగే ఆఫీసుకు వెళ్లిన తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. తన తోటి ఉద్యోగిని చెప్పిన మాట విని […]

ఐటీ ఉద్యోగినికి వేధింపులు.. గూగుల్‌లో ఆమె పేరుపై పోర్న్ సైట్స్..!
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 5:12 PM

హైదరాబాద్‌‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్ల వలలో పడింది. ఆమెను టార్గెట్ చేయడంతో.. మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఎవరో తెలుసుకునే పనిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది. ఉప్పల్‌‌కు చెందిన 33 ఏళ్ల ఒక మహిళ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటి లాగే ఆఫీసుకు వెళ్లిన తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. తన తోటి ఉద్యోగిని చెప్పిన మాట విని షాక్‌కు గురైంది. ఆమె పేరును గూగుల్‌లో సెర్చ్ చేసిన వెంటనే.. ఫోర్న్ వెబ్ సైట్ లింకులు ఓపెన్ అవుతున్నాయని తోటి ఉద్యోగిని చెప్పడంతో.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వారు చర్యలు తీసుకుంటామని చెప్పినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

గుట్టుగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంది. కాని ఆఫీసులో అందరికి తెలిసిపోయింది. సహ ఉద్యోగులు తనను హేళన చేయడం మొదలు పెట్టారు. దీంతొ కెరీర్‌ను బలి తీసుకుంది. ఆఫీసుకు వెళ్లలేక జాబ్‌కి రిజైన్ చేసింది. తనకు ఎదురైన పరిస్థితిపై గూగుల్‌కు నోటీసులు పంపింది. వారు కూడా తామేం చేయలేమంటూ చేతులెత్తేశారు. అయితే తన పేరును సెర్చ్ చేసిన వెంటనే ఫోర్న్ సైట్లు ఓపెన్ కావడం పై సదరు సైట్ల నిర్వాహకులకు.. వెబ్ హోస్ట్ ప్రొవైడర్లకు నోటీసులు పంపించారు. అయితే సైట్ల నుంచి తన పేరును తొలగించడం తమ చేతుల్లో లేదని వారు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో సుమారు రెండు సంవత్సరాలుగా ఆమె ఈ పరిస్థితిని అనుభవిస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సైబర్ క్రైం పోలీసులు, వెబ్ సైట్ల నిర్వాహకులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?