AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కన్ని చేసి.. ఐదుగురు కల్సి… నడి రోడ్డుపై దారుణం

పచ్చని పొలాలతో ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించే కోనసీమ ఒక్కసారిగా ఫ్యాక్షన్ సీమగా మారిపోయింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పరిగెత్తించి మరి కత్తులతో దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ ఘటన జరిగింది. సావురంకు చెందిన విప్పర్తి రవికుమార్ పై ఐదుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో రవికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రవికుమార్‌ను అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడ్డ వారి […]

ఒక్కన్ని చేసి.. ఐదుగురు కల్సి... నడి రోడ్డుపై దారుణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 30, 2019 | 3:54 PM

Share

పచ్చని పొలాలతో ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించే కోనసీమ ఒక్కసారిగా ఫ్యాక్షన్ సీమగా మారిపోయింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పరిగెత్తించి మరి కత్తులతో దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ ఘటన జరిగింది. సావురంకు చెందిన విప్పర్తి రవికుమార్ పై ఐదుగురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో రవికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రవికుమార్‌ను అమలాపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలింపు చేపట్టారు. దీనికి ఫ్యాక్షన్ గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us