AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..

Husband Decesed : సవ్యంగా సాగిపోతున్న జీవితాలలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మాయదారి కరోనా చిచ్చు పెట్టడం వల్ల చాలా కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల

భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన..  కారణాలు ఇలా ఉన్నాయి..
Husband Decesed
uppula Raju
|

Updated on: Mar 14, 2021 | 2:08 PM

Share

Husband Decesed : సవ్యంగా సాగిపోతున్న జీవితాలలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మాయదారి కరోనా చిచ్చు పెట్టడం వల్ల చాలా కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్‌(32) టాటాఏస్‌ వాహనం డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ కూడా పని దొరకకపోవడంతో అశోక్ నెమ్మదిగా తాగుడుకు బానిసయ్యాడు. అద్దె ఇల్లు, కుటుంబ పోషణ భారమవడంతో భార్యా పిల్లలను పుట్టింటికి పంపించేశాడు.

అయితే తీవ్ర మనస్తాపానికి గురైన అశోక్ శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. భార్య వద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు. చివరిసారిగా పిల్లలను మంచి గా చూసుకొమ్మని హితవు చెప్పాడు. అనంతరం గదిలోని ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంటి దగ్గరి నుంచి వచ్చేసరికి గదిలో నిర్జీవుడై ఉన్నాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సైదా తెలిపారు.

అధికారపార్టీకి జైకొట్టిన పట్టణవాసులు.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం.. అన్ని జిల్లాలోనూ క్లీన్‌స్వీప్..!

AP Municipal Elections: వైసీపీ ఘన విజయం.. సొంతపార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా..

Telangana, AP MLC Elections 2021 Live : తెలుగురాష్ట్రాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్