Husband Commits Suicide : హైదరాబాద్‌లో విషాద ఘటన.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..

Husband Commits Suicide By Killing Wife : హైదరాబాద్‌ పంజాగుట్ట పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలో, కుటుంబ సమస్యలో

Husband Commits Suicide : హైదరాబాద్‌లో విషాద ఘటన.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. కారణాలు ఇలా ఉన్నాయి..
Husband Commits Suicide
Follow us
uppula Raju

|

Updated on: Mar 12, 2021 | 9:59 PM

Husband Commits Suicide By Killing Wife : హైదరాబాద్‌ పంజాగుట్ట పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలో, కుటుంబ సమస్యలో తెలియదు కానీ ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుబ్బారావు, సాయిలక్ష్మీ దంపతులు యూసుఫ్ గూడ రహమత్ నగర్‌లో నివసిస్తున్నారు. గత కొంత కాలంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతున్న సాయిలక్ష్మీని భర్త సుబ్బారావు గురువారం సాయంత్రం పంజాగుట్ట స్వరాగ్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న కూకట్ పల్లిలో నివసించే వారి కుమార్తె అదేరోజు రాత్రి 7.30 సమయంలో వచ్చి చూసి వెళ్లారు. వైద్యులు కూడా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

అయితే శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది కుమార్తెకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పరీక్షించిన వైద్యలు భార్య సాయిలక్ష్మీ మరణించినట్టు నిర్థారించారు. సుబ్బారావు అపస్మారక స్థితిలో ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ సుబ్బారావు కూడా మరణించాడు.

ఇదిలా ఉండగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న కారణంగానే అనారోగ్యంతో ఉన్న భార్యను చంపి, భర్త సుబ్బారావు విషం తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నందునే మరణిస్తున్నట్టు సూసైడ్ నోట్ లభించింది. కుమార్తె ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని చదవండి : India vs England 1st T20: ముగిసిన టీ20 తొలి ఇన్నింగ్స్… ఇంగ్లండ్ లక్ష్యం 125 పరుగులు..

GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

Kuchipudi Dancer : క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు దానం చేసిన ప్రముఖ డ్యాన్సర్.. ఎవరో తెలుసా..