ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. వ్యక్తి మృతి సమాచారం ఇంట్లో వారికి ఇవ్వకుండా..

ఒంగోలు రిమ్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి విషయాన్ని రిమ్స్ అధికారులు కుటుంబ సభ్యులకు వెల్లడించలేదు.

ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. వ్యక్తి మృతి సమాచారం ఇంట్లో వారికి ఇవ్వకుండా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 6:16 PM

ఒంగోలు రిమ్స్‌లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఓ వ్యక్తి విషయాన్ని రిమ్స్ అధికారులు కుటుంబ సభ్యులకు వెల్లడించలేదు. ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులకు అతడు కనిపించకపోవడంతో ఆరా తీయగా.. మరణించిన విషయం వారికి తెలిసింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వైద్యాధికారులపై మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కురిచేడుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల 20న రిమ్స్‌లో చేరాడు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. ఇక మరోవైపు  ఆ వ్యక్తి  పరిస్థితిపై బుధవారం కుటుంబ సభ్యులు వాకబు చేయగా.. ఆయన బాగానే ఉన్నాడని, కోలుకుంటున్నాడని వైద్య సిబ్బంది వెల్లడించారు. ఇక ఇవాళ అతడిని చూసేందుకు వారు రిమ్స్‌కు చేరుకోగా.. వార్డులో ఆ వ్యక్తి కనిపించలేదు. వెంటనే రిసెప్షన్‌లో ఎంక్వైరీ చేయగా.. మృతి చెందాడని, మృత దేహం మార్చురీ వార్డులో ఉందని అక్కడి సిబ్బంది తెలిపింది.  దీంతో షాక్‌కి గురైన కుటుంబ సభ్యులు సంతకాలు చేసి మృతదేహం స్వాధీనం చేసుకుని కురిచేడుకు తరలించే పనిలో పడ్డారు.