Hyderabad Stabbed:హైదరాబాద్ దారుణం.. వెడ్డింగ్ కార్డులో పేరు లేదని బంధువులపై కత్తితో దాడి.. నలుగురికి గాయాలు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారితీసింది. పెళ్లి పత్రికలో పేర్లు వేయించలేదని కత్తితో దాడి చేశారు.
Four Stabbed in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చిన్నపాటి గొడవ కత్తిపోట్లకు దారితీసింది. పెళ్లి పత్రికలో పేర్లు వేయించలేదని కత్తితో దాడి చేశారు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల కిందట సికింద్రాబాద్‌లోని ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన సురేశ్ వివాహం సుష్మతో జరిగింది. పెండ్లి పత్రికలో తమ తల్లిదండ్రుల పేర్లు పెట్టలేదని, అదే ప్రాంతానికి చెందిన సర్వేశ్ (20), చంద్రశేఖర్ (25)లు తమ బంధువులైన బాలమణి (సురేశ్ సోదరి) కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఘర్షణ పెద్దదవుతుండటంతో బంధువులందరూ సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు.
ఇదిలావుంటే, తన కుటుంబ సభ్యులు, పెండ్లికి వచ్చిన బంధువులతో కలిసి బాలమణి ఆదివారం సర్వేశ్ ఇంటికి వెళ్లింది. ఇదే క్రమంలో తిరిగి పెండ్లి పత్రికలో పేర్ల విషయంలో గొడవ వాగ్వాదం మొదలైంది. ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన సర్వేశ్, చంద్రశేఖర్‌లు తమ ఇంటికి వచ్చిన బంధువులపై రెచ్చిపోయారు. సర్వేశ్ ఇంట్లో ఉన్న కత్తితో బాలమణి బంధువులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. చంద్రశేఖర్ సైతం అదే కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రవీణ్ (30), పరుశురాం (35), యాదగిరి (42), ప్రతాప్‌కుమార్ (32)లు కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్ర గాయాలతోనే వారు పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని, గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపుల చర్యలు చేపట్టారు.
Read Also….
Wedding: ఎడ్ల బండ్లపై పెళ్లి ఊరేగింపు.. డీజే లేకుండా జానపద పాటలు పాడుతూ.. డ్యాన్స్.. వీడియో వైరల్..
Criminal Case: నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులే.. మరో 9 ఆసుపత్రులపై జగన్ సర్కార్ కొరడా..