Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన పెళ్లి లారీ.. 20 మందికి గాయాలు.. నలుగురికి..
Nellore Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న టిప్పర్‌ను వెనక నుంచి మినీ లారీ ఢీకొనడంతో 20 మందికి
Nellore Accident: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న టిప్పర్‌ను వెనక నుంచి మినీ లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద ఈ రోడ్డు ప్రమాదం ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కడప జిల్లా గోపవరం మండలం పీపీగుంటకు చెందిన పెళ్లి బృందం నెల్లూరు జిల్లాలోని కదలకూరు మండలం గిద్దలూరు గ్రామానికి మినీ లారీలో బయలుదేరింది. మార్గమధ్యంలో ఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారికి ఒకవైపు టిప్పర్ ఆగి ఉంది. ఈ క్రమంలో టిప్పర్ ను గమనించని మినీ లారీ డ్రైవర్ అదుపుతప్పి వెనకనుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. మరో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు అతివేగమే కారణమని భావిస్తున్నారు.
Also Read: