Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. వాహనాల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..

Accident at National Highway: రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదర్శ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని నేషనల్ హైవే

Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. వాహనాల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 11:21 AM

Accident at National Highway: రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదర్శ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని నేషనల్ హైవే 8పై రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం అనంతరం లారీల క్యాబిన్లల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో నిమిషాల్లోనే నలుగురు వ్యక్తులు, వాహనాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మూడు మృతదేహాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఆదర్శనగర్ ఎస్ఐ కన్హయ్య లాల్ పేర్కొన్నారు. ఈ ఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారి నంబర్‌-8 పై సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఓ లారీ జైపూర్‌ నుంచి బీవార్‌ వెళ్తోంది. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బీవార్‌ నుంచి జైపూర్‌ వెళ్తున్న మరో లారీని ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు వాహనాలకు అంటుకున్నాయి. లారీల్లో డ్రైవర్లతో పాటు మరో ఇద్దరు అందులోనే చిక్కుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లారీలో నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నాడు. రెండు లారీలకు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడటంతో జాతీయ రహదారిపై చాలా సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Also Read:

షాకింగ్.. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడైనా చూశారా..? బైకర్ ప్రాణాలు తీసిన నెమలి..

Cyber Crime: లక్కీ డ్రాలో కారొచ్చిందంటూ ఫోన్.. నిజమని నమ్మి కేటుగాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ