Protest with Dead Body: మూడు రోజులుగా ఇంటి ఎదుట డెడ్ బాడితో ఆందోళన..అసలేం జరిగిందంటే..?
రక్త సంబంధాలన్నీ.. ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. సొంత తమ్ముడి ఇంటి ముందే అన్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అదీ కూడా చనిపోయిన వ్యక్తి డెడ్‌బాడీతో మూడు రోజులుగా..
Villagers Protest with Dead Body: మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తుల కోసం రక్త సంబంధాలన్నీ.. ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఇదే క్రమంలో సొంత తమ్ముడి ఇంటి ముందే అన్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అదీ కూడా చనిపోయిన వ్యక్తి డెడ్‌బాడీతో రెండు రోజులుగా నిరసనకు కొనసాగిస్తున్నారు. అయినా అతనికి మాత్రం కనికరం కలగలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భూ తగాదాలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహంతో సొంత తమ్ముడు ఇంటి ముందే చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గారంపల్లి సాంబశివరావు (60) అనే రైతు శనివారం రాత్రి గ్రామ శివారులోని బోటి(గుట్ట) సమీపం లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు సాంబశివరావు మృతికి అతని తమ్ముడైన శ్రీకాంత్ కారణమంటూ మృతదేహాన్ని ఆదివారం ఉదయం నుండి శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
అయితే, సాంబశివరావు మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించకుండా, తగిన న్యాయం చేయాలంటూ శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టేందుకు గ్రామానికి చేరుకున్నారు. సాంబశివరావు చావుకు కారణమైన శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసిన తగిన చేయాలని కుటుంబసభ్యులు బీష్మించుకు కూర్చున్నారు. మృతదేహనికి పంచనామా నిర్వహించేందుకు సైతం సహకరించలేదు.
అయితే, ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు గ్రామ పెద్దలతో చర్చలు జరిపినప్పటికీ, కొలిక్కి రాకపోవడంతో సోమవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే మృతదేహం వద్ద సోమవారం మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో జనం ఉన్న సమయం లో పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, గ్రామ దేవాలయంలోని మైక్ ద్వారా విషయాన్ని అనౌన్స్ చేయడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో చేసేది ఏమిలేక పోలీసులు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు, సాంబశివరావు కుటుంబసభ్యుల ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. వీరికి గ్రామస్తుల మద్దతు లభించడంతో నిరసన రెండో రోజుకు చేరింది.
Read Also… Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. వాహనాల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..