ఇది సినిమా షూటింగ్‌ కాదు…బోట్‌ రేసింగ్‌ అంతకంటే కాదు….నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య బిగ్ ఫైట్.. ఎందుకంటే?

మత్స్యకారుల మధ్య అధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడు లోని మైలాడుతురై మత్సకార గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇది సినిమా షూటింగ్‌ కాదు...బోట్‌ రేసింగ్‌ అంతకంటే కాదు....నడిసంద్రంలో మత్స్యకారుల మధ్య బిగ్ ఫైట్.. ఎందుకంటే?
Fishermen Fight
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 17, 2021 | 10:30 AM

Tamil Nadu Fishermen fight: మత్స్యకారుల మధ్య అధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడు లోని మైలాడుతురై మత్సకార గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తరంగబడి, వాణగిరి,తిరుముల్లై వాయిల్‌ గ్రామాల్లో బల్ల వలల వాడకాన్ని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలు తీర్మానం చేసినా…తిరుముల్లై వాయిల్‌ మత్స్యకారులు లెక్కచేయడం లేదు. గ్రామస్తుల తీర్మానానికి వ్యతిరేకంగా సముద్రంలోకి బల్ల వలలతో చేపలవేటకు వెళ్లారు.

ఈ విషయం తెలిసిన తరంగబడి, వాణగిరి గ్రామానికి చెందిన మత్స్యకారులు తమ బోట్లతో వాళ్ల సంగతి తేల్చడానికి నడిసంధ్రంలోకి వెళ్లారు. తిరుముల్లై వాసులను చేపలవేటను ఆపేయాలని కోరారు. అయితే, వారు వినకపోవడంతోపాటు బోటుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఇరువర్గాల మధ్య కాసేపు సినిమాల్లోని సీన్‌ గుర్తుకుతెచ్చేలా బోట్‌ వార్‌ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. సుమారు ఆరు బోట్లు ధ్వంసం అయ్యాయి. దాంతో మత్స్యకార గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. చేపలవేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.

నాగం, మైలాడుతురై జిల్లాల్లోని మత్స్యకారుల ఫిషింగ్ వ్యవస్థలో ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నామ్ తమిళ పార్టీ చీఫ్ కో-ఆర్డినేటర్ సీమన్ కోరారు. సముద్రంలో చేపల వేటలో వివాదాల కారణంగా నాగ, మైలాడుతురై జిల్లాల మత్స్యకారుల మధ్య తలెత్తిన ఘర్షణ హింసకు దారి తీయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మత్స్య బిల్లును ఆమోదించడానికి పరుగెత్తుతున్న ఈ పరిస్థితిలో, నాగా, మైలాడుతురై జిల్లాల మత్స్యకారులు చేపల వేటకు అవసరమైనప్పుడు గొడవలు మొదలవుతున్నాయి.

ఈ సమస్యలు నెలరోజులుగా కొనసాగుతున్నప్పటికీ, మత్స్యకారులు.. వారి జీవనోపాధిపై ప్రభుత్వం కఠినమైన చట్టం ద్వారా మత్స్యకారులకు అనేక అవాంతరాలను ఎదుర్కొంటున్నారు. అయితే, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, నాగాయ్, మైలాడుతురై జిల్లాల మత్స్యకారుల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించడానికి తక్షణ చర్య తీసుకోవాలని, వారిని ఏకాభిప్రాయ స్థితికి తీసుకురావాలని, రాజీపడాలని స్థానికులు కోరుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త బిల్లుపై మత్స్యకారుల ఆందోళన ఉధృతమవుతోంది. ‘ఇండియన్‌ మెరైన్‌ ఫిషరీస్‌ బిల్లు’కు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చాలా గ్రామాల్లో (ఫిషింగ్‌) మత్స్యకారులు నల్లాజెండాలను ఎగురవేశారు. నిరసనలు, ఆందోళనలు హోరెత్తిస్తున్నారు.. ఈ బిల్లును వెంటనే ఉపసంహరిచుకోవాలనే డిమాండ్‌ను ప్రస్తావిస్తున్నారు. చెన్నైలోని సముద్ర తీర ప్రాంతాలతో పాటు మెరీనా బీచ్‌ను మత్స్యకారులు ముట్టడించకుండా ఆయా ప్రాంతాల్లో భారీగా బారీకేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. తూత్తుకుడిలో మత్స్యకారులు చేపలు పట్టకుండా ఉండి.. ఈ బిల్లుపై నిరసన వ్యక్తంచేశారు. మత్స్యకార సంఘాల నాయకత్వ సంస్థ అయిన తమిళనాడు-పుదుచ్చేరి మత్స్యకారుల సమాఖ్య పిలుపు మేరకు ఇండియన్‌ మెరైన్‌ ఫిషరీస్‌ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

ఇదిలావుంటే, సాంప్రదాయ మత్స్యకారులను ప్రభావితం చేసే సమస్యలను ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. మత్స్యకారుల నుండి లైసెన్సులు, జరిమానాల పేరిట డబ్బు సేకరించడం మాత్రమే దీని లక్ష్యం. బిల్లు విషయంలో కేంద్రం ఎవరినీ సంప్రదించలేదు. చేపలు పట్టే సమాజ సంప్రదాయాలు, సంస్కృతిని అర్థం చేసుకోలేదని మత్స్యకారుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, చిన్న చిన్న, ఫైబర్‌, యాంత్రిక పడవలను చేపలు పట్టే నౌకలుగా పరిగణించే నిబంధన ఈ నిరసనలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ బిల్లు ఫిషింగ్‌ వ్యాపార ప్రక్రియను కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని మత్స్యకారులు భయపడుతున్నారు.

Read Also…. కర్నూలు జిల్లా స్కూల్ దంపతుల ఆత్మహత్యకు కారణ అదే.. తీవ్ర ఆరోపణలు చేసిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్