AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు, జరిమానా.. శిక్ష ఖరారు చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు

ఎలక్షన్ పీరియడ్ లో నేతలు ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతూ తమ ఆధిక్యత కోసం పరుగులు తీస్తారు నాయకులు.

ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు, జరిమానా.. శిక్ష ఖరారు చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
Distributing Money For Election
Balaraju Goud
|

Updated on: Aug 12, 2021 | 9:58 PM

Share

Ex MLA Jailed and Fined for Distributing Money: ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా సరియైన శిక్ష పడటం లేదు. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..

మాములుగా మన దేశంలో ఎన్నికలు అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఎలక్షన్ పీరియడ్ లో నేతలు ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన రహస్యమే. ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతూ తమ ఆధిక్యత కోసం పరుగులు తీస్తారు నాయకులు. అయితే, ఇది ఎప్పటి నుండో వస్తున్న రాజకీయం సంప్రదాయమే. ఓటుకు నోటు తీసుకునే పౌరుడు లేకపోతే.. ఓట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టే నాయకులు ఎందుకు పుట్టుకొస్తారు అన్న సామెత లేకపోలేదు. అయినా ఇదంతా ఎప్పుడూ జరిగే తతంగమే. అయితే, ఎన్నికల సమయంలో డబ్బులు పంచినందుకు గానూ మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించింది కోర్టు.

పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలలు జైలు, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టి కోర్టు గురువారం శిక్షను ఖరారుల చేసింది. విచారణలో అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. అయితే, తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది. ఇదిలావుంటే, ప్రభుత్వ చీఫ్‌ విప్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.

Read Also…. Telangana Governor: ప్రధాని మోదీకి ఇచ్చిన పుస్తకంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర విషయాలు