Chennai Bus Fire Incident: తమిళనాడు రాజధాని చెన్నైలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నడి రోడ్డుపైనే ప్రభుత్వ బస్సు తగలబడిపోయింది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు..వెంటనే బస్సు నుంచి కిందకు దిగేశారు. దీంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. కోయంబేడు బస్టాండ్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురం నుంచి వస్తున్న బస్సు..మరికొన్ని నిమిషాల్లో కోయంబేడు బస్టాండ్‌కు చేరుకోవడానికి ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపైనే బస్సు తగలబడటంతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నందునే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నట్లు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో మంటలు చెలరేగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాలంచెల్లిన బస్సులను గుర్తించి.. వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నడిరోడ్డుపై కాలిబూడైన ప్రభుత్వ బస్సు..వీడియో
Also Read..
CS Somesh Kumar: పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై సీఎస్ కారు.. ఫైన్ విధించిన పోలీసులు.. ఎందుకంటే..
Dil Raju: రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి చాలా సహకారం అందించాయన్న దిల్ రాజు..