CS Somesh Kumar: సీఎస్ సోమేశ్ కుమార్‌కు షాకిచ్చిన పోలీసులు.. పూర్తి వివరాలు..
రోడ్డుపైకి వాహనం తీసుకొని వచ్చారు. రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఏం చేస్తారు.. గేర్ వేసి స్పీడ్ అందుకుంటారు. కానీ ఈ స్పీడ్‌కు కూడా...
రోడ్డుపైకి వాహనం తీసుకొని వచ్చారు. రోడ్డుపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఏం చేస్తారు.. గేర్ వేసి స్పీడ్ అందుకుంటారు. కానీ ఈ స్పీడ్‌కు కూడా లిమిట్ ఉంది. ఈ లిమిట్ దాటి స్పీడ్ వెళ్తే జేబుకు చిల్లే.. నిర్దేశించిన దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. కొంతరికి ఈ రూల్ తెలియక స్పీడ్ వెళ్తుంటారు. మరి కొందరు వేగంగా వెళ్తే ఎమవుతుందని వెళ్తుంటారు. నిబంధనల గురించే మాట్లాడే అధికారి వాహనమే స్పీడ్.. వెళ్తే వారికి చాలాన్ పడుతుందా.. అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన సీఎస్ వాహనానికి పోలీసులు ఫైన్ విధించారు. టోలి చౌకి పీఎస్ పరిధిలోని పీవీ నరసింహ రావు ఫ్లై ఓవర్‌పై సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం TS 09 FA 0001 ఓవర్ స్పీడ్‌తో వెళ్లింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనానికి మూడు వేల రూపాయల చాలాన్ విధించారు.
ఆ మధ్య సీఎం కేసీఆర్ కాన్వాయ్‌పై పోలీసులు ఫైన్ విధించారు. ట్రాఫిక్ రూల్స్‌కు సీఎం కాన్వాయ్ కూడా అతీతం కాదని.. ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు నిరూపించారు. సీఎం కాన్వాయ్‌పై ఓవర్ స్పీడ్‌కు సంబంధించి మొత్తం నాలుగు ఫైన్లు విధించారు. హైదరాబాద్‌లో రెండు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో తొలిసారి ఫైన్ విధించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోది.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోది, జూన్ 1న ట్యాంక్‌బండ్ పరిధిలో నాలుగో ఫైన్ విధించారు.
Read Also.. Indian Railways: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై రిజర్వేషన్ లేకున్నా ప్రయాణించవచ్చు.!