ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే పెట్రోల్ పోసి..!

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో మహిళా లెక్చరర్‌‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. నందోరి చౌక్‌లో నడిరోడ్డుపైనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని అంకితగా, నిందితుడిని వికేశ్‌గా గుర్తించారు. ఘటన తరువాత అతడు పరారీ అవ్వగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకొని […]

ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే పెట్రోల్ పోసి..!

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో మహిళా లెక్చరర్‌‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. నందోరి చౌక్‌లో నడిరోడ్డుపైనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని అంకితగా, నిందితుడిని వికేశ్‌గా గుర్తించారు. ఘటన తరువాత అతడు పరారీ అవ్వగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. దీనిపై విచారణ చేపడతామని ప్రకటించింది.

కాగా అంకిత, వికేశ్ ఒకే గ్రామానికి చెందిన వారు కాగా.. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. కానీ అతడి ప్రవర్తన నచ్చక రెండేళ్ల నుంచి అతడిని దూరం పెడుతూ వచ్చింది అంకిత. ఈ క్రమంలో వీరిద్దరికి వేర్వేరుగా వివాహం కూడా జరిగింది. అయినా వికేశ్, అంకితను వదల్లేదు. సోమవారం ఉదయం కాలేజ్ వద్ద కాపుకాసిన వికేశ్‌, మొదట అంకితతో ఘర్షణకు దిగాడు. ఆ తరువాత తన వెంట తెచ్చిన పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు గమనించేలోగా బైక్‌పై అక్కడి నుంచి పరారీ అయ్యాడు. అయితే వికేశ్ వలన గతేడాది అంకిత వివాహ జీవితం విచ్ఛిన్నమైనట్లు ఆమె బంధువులు తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. సతర్వం విచారణ జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu