తగలబడ్డ నది.. అధికారులు చెప్పిన రీజన్ వింటే షాక్…
మంటల్నీ ఆర్పాలంటే నీరు కావాల్సిందే. మరి ఆ నీరు ఉన్న నదిలో మంటలు వస్తే ఎలా..? అసలు వినడానికే ఇది వింతగా ఉన్నా.. అసోంలో జరిగిన ఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా కూడా నదుల్లో మంటలు వస్తాయా అని షాక్ తింటారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి చెందిన ఓ నది మధ్య భాగంనుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని బుర్హిదింగ్ నది కింది భాగం నుంచి.. ఆయిల్ పైప్‌లు వెళ్తున్నాయి. అయితే సడన్‌గా ఆ ఆయిల్ […]
మంటల్నీ ఆర్పాలంటే నీరు కావాల్సిందే. మరి ఆ నీరు ఉన్న నదిలో మంటలు వస్తే ఎలా..? అసలు వినడానికే ఇది వింతగా ఉన్నా.. అసోంలో జరిగిన ఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా కూడా నదుల్లో మంటలు వస్తాయా అని షాక్ తింటారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి చెందిన ఓ నది మధ్య భాగంనుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దిబ్రూగఢ్ జిల్లాలోని బుర్హిదింగ్ నది కింది భాగం నుంచి.. ఆయిల్ పైప్‌లు వెళ్తున్నాయి. అయితే సడన్‌గా ఆ ఆయిల్ పైప్ పేలడంతో.. నదిలో మంటలు చెలరేగాయి. పైప్ లైన్ కాస్త నది అంతర్భాగంలోనే పేలిపోవడంతో.. నదిపైన పెత్త ఎత్తున మంటలు చెలరేగాయి.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి.. ఈ ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైను నది తీరంలో లీక్ అవ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆయిల్ లీక్ అయిన తర్వాత అది కాస్త నదిలోకి వచ్చిందని తెలిపారు. అయితే ఇది గమనించిన ఎవరైనా.. నదీ తీరంలో నిప్పు పెట్టి ఉంటారని.. అందుకే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు జనవరి 31 నుంచి క్రూడ్ ఆయిల్ లీక్ అయినా.. అధికారులు పట్టించుకోలేదని.. నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా అధికారులు మాత్రం.. ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని స్పష్టం చేశారు.