ఫేస్‌బుక్‌లో ప్రేమ.. పెళ్లైన మూన్నాళ్లకే జంప్
ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. స్నేహితులుగా పరిచయమయ్యారు. ప్రేమించానని నమ్మించాడు. మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కాపురం పెట్టాడు. ఇంతలో చెప్పా పెట్టకుండా జంప్ అయ్యాడు.
ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. స్నేహితులుగా పరిచయమయ్యారు. ప్రేమించానని నమ్మించాడు. మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కాపురం పెట్టాడు. ఇంతలో చెప్పా పెట్టకుండా జంప్ అయ్యాడు. యువకుడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న యువతి అతని ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది. కర్నూలు జిల్లా నందవరం మండల కేంద్రంలో భర్త ఇంటి ముందు భార్య అనూష ధర్నా చేపట్టింది. ఫేస్‌బుక్‌లో మూడు నెలల క్రితం అనూషకు రాకేష్ పరిచయం అయ్యాడు. జులై 4వ తేదీ హైదరాబాద్‌లో రాకేష్, అనూషలు వివాహం చేసుకున్నారు. వివాహం అయ్యాక 4 రోజులు కాపురం కూడా చేశారు. ఇంతలో సొంతూరుకు వెళ్లి వస్తానంటూ నందవరంలో తన ఇంటికి రాకేష్ వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్న రాకేష్ జాడ కనిపించలేదు. తిరిగి హైదరాబాద్‌కు రాకేష్ రాకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ నందవరం చేరుకుంది. కాపురానికి రమ్మని వేడుకుంది. దీంతో రాకేష్ నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న ఆనూష అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలి అంటూ మహిళ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.