మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకర పోస్ట్, వ్యక్తి అరెస్ట్
ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పిడుగురాళ్లకి చెందిన వందనపు నాగారాజు అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై సోషల్ మీడియాలో..
ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. పిడుగురాళ్లకి చెందిన వందనపు నాగారాజు అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఓ పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఓ ముంబై వాసి.. అక్కడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐపీ అడ్రస్ ట్రేస్ చేయగా అది పిడుగురాళ్లకు చెందిన వందనపు నాగరాజుదిగా ముంబై పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే పోస్ట్ పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు.
Read More:
మరో ప్రముఖ నటి సూసైడ్, కలకలం రేపుతోన్న ఆత్మహత్యలు!
అరకులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి మృతి
కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం