ఫేస్‌బుక్‌లో వివాహిత ట్రాప్..వీడియోలు రికార్డు చేసి..
ఫేస్‌బుక్ మాయ చేస్తోంది. కాపురాలను కూల్చేస్తోంది. వివాహితలు మాయగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. వారి దుర్బుద్ది తెలుసుకునేలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచోసుకుంది. నగరంలోని రామ్‌నగర్‌కి చెందిన వివాహితకు ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఏపీలోని కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ ఒలకబోస్తూ ఆమెను మరో ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు సదరు యువకుడు. ఇంకేం హైదరాబాద్ రావడం మొదలెట్టాడు. ఇక ప్రేమ పక్షుల్లా విహరించడం మొదలెట్టారు ఇద్దరూ. ఈ […]
ఫేస్‌బుక్ మాయ చేస్తోంది. కాపురాలను కూల్చేస్తోంది. వివాహితలు మాయగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. వారి దుర్బుద్ది తెలుసుకునేలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచోసుకుంది. నగరంలోని రామ్‌నగర్‌కి చెందిన వివాహితకు ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఏపీలోని కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ ఒలకబోస్తూ ఆమెను మరో ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు సదరు యువకుడు. ఇంకేం హైదరాబాద్ రావడం మొదలెట్టాడు. ఇక ప్రేమ పక్షుల్లా విహరించడం మొదలెట్టారు ఇద్దరూ. ఈ సమయంలో క్లోజ్‌నెస్ పెరిగి.. దగ్గరయ్యారు.
ఇక్కడ తన గేమ్ ప్లాన్ యాక్టివేట్ చేశాడు చంద్రశేఖర్. సన్నిహితంగా మెలుగుతోన్న ఫోటోలు, వీడియోలు రికార్డు చేశాడు. వాటిని అడ్డుపెట్టుకోని ఆమెను బెదిరించడం షురూ చేశాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే వీడియోలు నెట్‌లో పెడతానంటూ బెదిరించాడు. వేధింపులు పెరగడంతో యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోని దిగిన పోలీసులు కడప జిల్లా కళాసపల్లిలో నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారుస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రశేఖర్ కూడా వివాహితుడే. బి కేర్‌ఫుర్ మహిళలు.