AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌ చాటింగ్‌తో రెండు ప్రాణాలు బలి !

ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఓ చిన్నారిని తల్లికి దూరం చేసింది.

ఫేస్‌బుక్‌ చాటింగ్‌తో రెండు ప్రాణాలు బలి !
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2020 | 2:33 PM

Share

ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది. ప్రేమించమంటూ ఓ యువకుడు వెంటపడినా ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ యువతికి వేరొకరితో పెళ్లైపోయింది. ఏళ్లు గడిచాక ఫేస్‌ బుక్‌ ద్వారా తిరిగి పరిచయం చేసుకున్నాడు. మంచి ఫ్రెండ్‌గా ఉంటానంటూ నమ్మబలికాడు. వ్యక్తిగత విషయాలు తెలుసుకొని మళ్లీ వేధించసాగాడు. ఈ క్రమంలోనే సదరు యువకుడు దారుణ హత్యకు గురికావడం.. ఈ హత్యానేరం తనపైకి వస్తుందని సదరు వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే…

గద్వాల జిల్లా వెంకటరమణ కాలనీకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ క్లాస్‌మేట్ గతంలో ప్రేమించాలని వెంటపడేవాడు.. కానీ, ఆమె యువకుడి ప్రేమను అంగీకరించలేదు..ఈ క్రమంలోనే ఆ యువతికి 2011లోనే మహబూబ్‌నగర్‌కు చెందిన మరో అబ్బాయితో వివాహమైంది. ప్రస్తుతం వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఏడాది కిందట ఫేస్‌బుక్‌ ద్వారా మళ్లీ ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి పరిచయం అయ్యాడు గతంలో ప్రేమ పేరుతో వెంటపడ్డ డిగ్రీ ఫ్రెండ్. అలా వారి మధ్య స్నేహాం పెరిగింది. కానీ అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి తర్వాత అతడిని దూరం పెడుతూ వచ్చింది. దీంతో ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. సదరు పోకిరీ. ‘నువ్వు నాతో మాట్లాడకపోతే వివాహేతర సంబంధం ఉందని నీ భర్తకు చెబుతా.. అలాగే, నీ భర్తను, తల్లిదండ్రులను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే గద్వాలలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సదరు యువకుడు…2020 ఫిబ్రవరి 24వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. తమ కుమారుడు కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు ఫిబ్రవరి 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి గద్వాల మండలం మేళ్లచెర్వు గుట్టల సమీపంలో పూడ్చినట్లు ఫిబ్రవరి 28న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైంది కార్తీక్‌ గా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే…తనను వేధింపులకు గురి చేసిన యువకుడు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న ఆ ఇల్లాలు..ఆందోళనకు గురైంది. ఆ నేరం తనపైకి వస్తోందనే భయంతో ఫిబ్రవరి 22న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలను సూసైడ్ లెటర్ రాసింది. తన జీవితంలో చిచ్చురేపిన వ్యక్తిని వదిలిపెట్టవద్దని కోరింది. మృతులిద్దరి వాదనలు వేర్వేరుగా ఉండటంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…కానీ, ఫేస్ బుక్ చాటింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఓ చిన్నారిని తల్లికి దూరం చేసింది.