ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై పోలీసులకు కంప్లైంట్ చేసిన డ్యాన్స్ మాస్టర్..
ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాకేశ్ మాస్టర్..ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో కనుమరుగయ్యారు. మరికొన్ని రోజులకు సోషల్ మీడియాలో వివాదాస్పద ఇంటర్వ్యూలలో రచ్చ క్రియేట్ చేశారు. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి..ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న శేఖర్ మాస్టర్‌ను పరుష పదజాలంతో మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నారు.
ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాకేశ్ మాస్టర్..ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గిపోవడంతో కనుమరుగయ్యారు. మరికొన్ని రోజులకు సోషల్ మీడియాలో వివాదాస్పద ఇంటర్వ్యూలలో రచ్చ క్రియేట్ చేశారు. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి..ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న శేఖర్ మాస్టర్‌ను పరుష పదజాలంతో మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో నటి శ్రీరెడ్డిపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక తాజాగా నందయూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను టార్గెట్ చేశాడు ఈ వివాదాస్పద డ్యాన్స్ మాస్టర్. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫేజ్‌లో ఉన్న ఆ హీరోల ఫ్యాన్స్ ఊరుకుంటారా..?. సోషల్ మీడియాలో సాలిడ్ కౌంటర్లతో రెచ్చిపోయారు. ఏకంగా చంపేస్తాం అనే రేంజ్‌కి వెళ్లింది వ్యవహారం.
విమర్శలు, వార్నింగ్‌ల తాకిడికి తట్టుకోలేకపోయాడు రాకేశ్ మాస్టర్. నందమూరి హీరోల అభిమానులు తనను చంపేస్తాం అని బెదిరిస్తున్నారంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల్ని తారక్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుని..తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోజుకు వందల మంది వ్యక్తులు ఫోన్స్ చేస్తున్నారని, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని అతను వాపోయాడు. అలాగే నటి శ్రీరెడ్డితో కూడా తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో తెలియజేశాడు. దాదాపు1500పైగా సాంగ్స్‌ని కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ ఇలా మారిపోతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. నోరు మంచిదైతే..ఊరు మంచిదవుతోందని ఇందుకే అంటారు పెద్దలు.
ఇది కూడా చదవండి : హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?