Prabhas 21: ప్రభాస్‌‌ జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్లు..!

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న బాహుబలి ప్రభాస్.. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.

Prabhas 21: ప్రభాస్‌‌ జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 29, 2020 | 7:40 PM

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న బాహుబలి ప్రభాస్.. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వైజయంతీ మూవీస్ నిర్మించబోతోంది. ఇక ఈ మూవీని పాన్ వరల్డ్‌ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందుకోసం నటీనటులను ఎంచుకునే పనిలో ఉన్నారు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకునే‌, ప్రియాంక చోప్రాలను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే వీరితో సంప్రదింపులు జరపబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరికి బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. అంతేకాదు వీరిద్దరికి హిట్ పెయిర్‌ అన్న టాక్ కూడా బాలీవుడ్‌లో ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరి పేర్లను దర్శకుడు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ ఏ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతారు..? ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌ పక్కన నటించే అవకాశం ఏ హీరోయిన్లు సొంతం చేసుకుంటారు..? ప్రభాస్ మూవీలో ఎవరెవరు భాగం కానున్నారు..? అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. Read This Story Also: ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల మూవీ స్టోరీ థీమ్ ఏంటంటే..?