Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Prabhas 21: ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల మూవీ స్టోరీ థీమ్ ఏంటంటే..?

బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. అందుకు తగ్గుట్టుగానే డార్లింగ్ చేసిన  'సాహో' పాన్ ఇండియా మూవీగా రిలీజయ్యింది. కానీ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు ప్రభాస్. 'రాధేశ్యామ్' ,  'ఓ డియర్' అనే టైటిళ్లు ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయి.
Prabhas teams up with Nag Ashwin; Surprising collaborations in Telugu cinema, Prabhas 21:  ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల మూవీ స్టోరీ థీమ్ ఏంటంటే..?

Prabhas 21: బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. అందుకు తగ్గుట్టుగానే డార్లింగ్ చేసిన  ‘సాహో’ పాన్ ఇండియా మూవీగా రిలీజయ్యింది. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు ప్రభాస్. ‘రాధేశ్యామ్’,  ‘ఓ డియర్’ అనే టైటిళ్లు ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయి. కాకపోతే మూవీ షూటింగ్ పదే, పదే వాయిదా పడటం..డార్లింగ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తోంది. అదీకాక రిలీజైన ప్రీ లుక్ కూడా అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు.  ఇలాంటి సమయంలో ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో వైజయంతి బ్యానర్‌లో మూవీ సడన్‌గా అనౌన్స్ చేసి పండుగ తీసుకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటుంది. అది చాలదన్నట్టు పాన్ ఇండియా కాదు..పాన్ వరల్డ్ రేంజ్‌‌లో సినిమా ఉండబోతుందంటూ అంచనాలు మరింత పెంచేశాడు నాగ్ అశ్విన్.

దీంతో మూవీ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్‌లో ఆతృత ఎక్కువ అయిపోయింది. దర్శకుడిగా నాగ్ అశ్విన్‌పై టాలీవుడ్ ఆడియెన్స్‌కు విపరీతమైన నమ్మకం ఉంది. ఎందుకంటే అతడు..సాధారణంగా సినిమా గురించి చెప్పడు..చెప్తే..ఆ మాట పోగొట్టుకోడు. మాస్ ఎలివేషన్స్ సంగతి పక్కనబెడితే..కథను అందంగా తెరకెక్కించడం, ఎమోషన్స్ పండించడంలో మాత్రం ముందుంటాడు. ఇక ఈ మూవీ కథపై కూడా అప్పుడే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అందులో ఒకటి మాత్రం ఆడియెన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ జానర్ పేరు చెప్పగానే అందరికి బాలయ్య-సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ‘ఆదిత్య 369’ గుర్తుకు వస్తుంది. టాలీవుడ్‌లో అదో క్లాసిక్‌గా అందరూ చెప్పకుంటారు. మరి తాజా యువ జోడి మరో క్లాసిక్‌ని అందిస్తారా..? అసలు టైమ్ మిషన్ నేపథ్యం నిజమేనా..?  అనే అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

ఇది కూడా చదవండి :‘కేజీఎఫ్​’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​…

Related Tags