Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్…బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?

రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ నిజజీవితం ఇప్పుడు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. హీరో ధనుష్ తమ కొడుకే అని, చిన్నతనం మందలిస్తే..ఇంటి నుంచి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నాన్చివేత దోరణిని అవలంభించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్‌కి షాక్ ఇచ్చింది. 
Controversy over Actor Dhanush's parents, హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్…బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?

రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ నిజజీవితం ఇప్పుడు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. హీరో ధనుష్ తమ కొడుకే అని, చిన్నతనంలో మందలిస్తే..ఇంటి నుంచి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నాన్చివేత దోరణిని అవలంభించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్‌కి షాక్ ఇచ్చింది.

తాజాగా జరిగిన విచారణలో ధనుష్ జనన, విద్య, ఇంటికి సంబందించిన ఒరిజినల్ సర్టిపికెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించింది.  ఇంత జరుగుతున్నా ధనుష్ జనన సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్‌ను ఆదేశించింది. మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ..తామెవరో తెలయదంటే భరించలేకపోతున్నాం అని కదిరేశన్ దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.  డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపారు. గతంలో ధనుశ్ పుట్టుమచ్చులు చెరిపించుకున్నాడనే వ్యవహారం కూడా సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ ప్రొఫిషన్‌లో భాగంగానే అలా చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు అతడు. ముందు ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

ఇది కూడా చదవండి : వావ్..మహేశ్ ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు సర్​ప్రైజ్​లు

Related Tags