రూ.100 కోట్లకు పైగా కూడబెట్టిన రౌడీషీటర్ ఖైజర్ పహెల్వాన్‌.. రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్

హైదరాబాద్ మహానగరంలోని హబీబ్‌నగర్ రౌడీషీటర్ ఖైజర్ పహెల్వాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌లో కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఈసీఐఆర్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈడీ అతనిపై విచారణ ప్రారంభించాలని హైదరాబాద్ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు.

రూ.100 కోట్లకు పైగా కూడబెట్టిన రౌడీషీటర్ ఖైజర్ పహెల్వాన్‌.. రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్
Rowdy Sheeter Khaiser
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 08, 2023 | 1:11 PM

హైదరాబాద్ మహానగరంలోని హబీబ్‌నగర్ రౌడీషీటర్ ఖైజర్ పహెల్వాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌లో కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఈసీఐఆర్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈడీ అతనిపై విచారణ ప్రారంభించాలని హైదరాబాద్ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌ శాండిల్య దర్యాప్తు ప్రారంభించి పలు క్రిమినల్‌ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. విచారణలో ఖైజర్ అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

అక్టోబర్ 26న హబీబ్‌నగర్ పోలీసులు ఖైజర్‌పై కేసు నమోదు చేసి పట్టుకున్నారు. అతను అనేక క్రిమినల్ కేసులలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక ముఠాను నిర్వహిస్తున్నాడని పోలీసలు తెలిపారు. పీడీ యాక్ట్ కింద ఖైజర్‌ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఖైజర్ పిక్ పాకెటింగ్, దొంగతనాలతో నేర కార్యకలాపాలను తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత 1995లో వ్యక్తిగత కక్ష్యతో నాంపల్లిలోని గూడ్‌షెడ్‌లో అఫ్జల్‌ను హత్య చేశాడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఓ ముఠాగా ఏర్పడి అమాయకులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు భూకబ్జాలు, దోపిడీ తదితర 22 క్రిమినల్ కేసుల్లో ఇతడికి ప్రమేయం ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. అక్రమ కార్యకలాపాలతో దాదాపు రూ. 100 కోట్లు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు.

ఖైజర్ సంపాదించిన ఆస్తిలో ఇళ్లు, రిసార్ట్, హోటళ్లు మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టాడు. నేరపూరిత చర్యల కారణంగా, అతనిపై 2011 సంవత్సరంలో నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు పోలీస్ కమిషనర్. ఒక సంవత్సరం కాలపరిమితి ముగిసిన తర్వాత, అతను హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, మళ్లీ తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. 2014లో పీడీ చట్టం కింద నిర్బంధించి చర్లపల్లి జైలులో ఉంచారు. పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఈడీకి రిఫర్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట ఈ కేసును ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ఫైల్ చేయడం జరిగింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…