Gold Smuggling Chennai: 8మంది కడుపులో 4 కేజీల బంగారం ఉండలు.. కస్టమ్స్ అధికారులు సీజ్

అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి బంగారం . మత్తు పదార్ధాలను తరలించడానికి కడుపుని అడ్డుపెట్టుకోవడం సినిమాల్లో చూశాం.. కానీ రోజు రోజుకి నిజ జీవితంలో కూడా బంగారం అక్రమ రవాణా కోసం ఎంతకైనా...

Gold Smuggling Chennai: 8మంది కడుపులో 4 కేజీల బంగారం ఉండలు.. కస్టమ్స్ అధికారులు సీజ్
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2021 | 10:00 AM

Gold Smuggling Chennai: అక్రమంగా ఒక దేశం నుంచి మరో దేశానికి బంగారం . మత్తు పదార్ధాలను తరలించడానికి కడుపుని అడ్డుపెట్టుకోవడం సినిమాల్లో చూశాం.. కానీ రోజు రోజుకి నిజ జీవితంలో కూడా బంగారం అక్రమ రవాణా కోసం ఎంతకైనా తెగిస్తున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బంగారాన్ని మాత్రల రూపంలో మింగేసి అక్రమరవాణాకు పాల్పడిన 8 మందిని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. నిందితుల కడుపు నుంచి దాదాపు రూ 2 కోట్ల 17 లక్షల విలువైన 4.15 కిలోల బంగారాన్ని బయటకు తీశారు.

వందేభారత్‌ ఎయిర్‌ ఇండియా విమానం జనవరి 30న దుబాయ్‌ నుంచి చెన్నైకి చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికుల్లో 8 మందిపై కస్టమ్స్‌ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. అయినా అనుమానం తీరకపోవడంతో విమానాశ్రయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కడుపు భాగాన్ని ఎక్స్‌రే తీయగా బంగారు ఉండలు మాత్రల రూపంలో కనిపించాయి. మంచినీళ్లు తాగుతూ మాత్రల రూపంలో బంగారాన్ని మింగినట్లు అంగీకరించారు. వీరిని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు. నిందితులు కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్‌ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను అరెస్ట్ చేశారు.

Also Read:

సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి సంవత్సరీకం జరిపే గ్రామం..