సూర్యాపేట శివారు ప్రాంతాల్లో క్షుద్ర పూజల కలకలం.. “విస్తరిలో పిండి బొమ్మ పెట్టి, పసుపు కుంకుమలు చల్లి”
సూర్యాపేట శివారు ప్రాంతాలు క్షుద్ర పూజలతో బెంబేలెత్తిపోతున్నాయి. సదరు ఏరియాల్లోని కూడళ్ళు , గిట్టని వారి ఇళ్ల ముంగిళ్ళల్లో చేతబడి ఆనవాళ్ళు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు.
సూర్యాపేట శివారు ప్రాంతాలు క్షుద్ర పూజలతో బెంబేలెత్తిపోతున్నాయి. సదరు ఏరియాల్లోని కూడళ్ళు , గిట్టని వారి ఇళ్ల ముంగిళ్ళల్లో చేతబడి ఆనవాళ్ళు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తరచూ ఇలాంటి జరుగుతున్నాయని పోలీసులు నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు .
చేతబడి నేపథ్యం, వరుస సంఘటనలతో సూర్యాపేట శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాలైన శ్రీరామ్ నగర్, బాలాజీ నగర్, కృష్ణ నగర్ కాలనీల్లోని కూడళ్ళ వద్ద జన సంచారం లేని సమయంలో రాత్రి వేళ్ళల్లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారు. కొద్ది రోజులు కూడళ్లకే పరిమితమైన క్షుద్ర పూజలు తాజాగా బాలాజీ నగర్ కాలనీలోని ఓ ఇంటి ముందు అర్ధరాత్రి దర్శనమిచ్చాయి.
విస్తరిలో పిండి బొమ్మ పెట్టి, పసుపు కుంకుమలు చల్లి భయంకరంగా కనిపించాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న వారు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. భయం నుంచి తెరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల ఆ ఇంటికి చెందిన యువకుడికి ప్రేమ విషయంలో మరో అమ్మాయితో గొడవలు జరగడం , సీసీ కామెరాలో రాత్రి పూట కొంత మంది అమ్మాయిలు స్కూటీపై ఆ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్ళు కనిపించడంతో ఇది వారి పనేనా అనే కోణంలో దర్యాప్తు చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.
Also Read: