AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Fight: పోలీస్ స్టేషన్లో పోలీస్‌ల కొట్లాట.. పిడిగుద్దులు, ముష్టియుద్ధాలు

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏ.ఎస్.ఐ తిరుమలరావు, హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్‌లు ముష్టి యుద్ధానికి దిగారు. స్టేషన్ లో కంప్యూటర్ విషయమై ఇద్దరి మధ్య నెలకొన్న

Police Fight: పోలీస్ స్టేషన్లో పోలీస్‌ల కొట్లాట.. పిడిగుద్దులు, ముష్టియుద్ధాలు
Police Fight In Station
Venkata Narayana
|

Updated on: Aug 12, 2021 | 9:13 PM

Share

Police Fight – East Godavari – Pithapuram: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏ.ఎస్.ఐ తిరుమలరావు, హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్‌లు ముష్టి యుద్ధానికి దిగారు. స్టేషన్ లో కంప్యూటర్ విషయమై ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం కాస్తా.. ఇరువురి మధ్యా ఆగ్రహావేశాలకు దారితీసి.. ఒకరిపై ఒకరు పడి వీధి రౌడీల్లా కొట్లాడుకున్నారు. విషయం జిల్లా ఎస్పీ రవీంద్రనాద్‌కు చేరడంతో ఎస్పీ తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇద్దరిపై వేటు వేసి.. వి.ఆర్ కు పంపించారు జిల్లా ఎస్పీ.

సినిమా స్టైల్లో, మూవీ షూటింగ్ స్పాట్ వద్ద చీటింగ్..

ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న చోట సినీ ఫక్కీలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశారు కొందరు కేటుగాళ్లు. సినిమా షూటింగ్‌కు ఇక్కడ అనుమతి లేదని వక్ఫ్ బోర్డ్‌ అనుమతి తీసుకోవాలని బెదిరించారు. వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ మాదిరిగా మాట్లాడి 50 వేలు వసూలు చేశారు. అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. వాళ్లకు వక్ఫ్‌ బోర్డుతో సంబంధం లేదని తేలింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ఉన్న ల్యాంకో హిల్స్‌ దగ్గర డైరెక్టర్‌ శ్రీను తన టీమ్‌తో ఓ సినిమా షూటింగ్‌ చేస్తున్నాడు.

అయితే హఠాత్తుగా అక్కడికి వచ్చిన కొందరు యూట్యూబ్‌ ఛానల్‌ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. ఇక్కడ షూటింగ్‌కు అనుమతి ఎవరిచ్చారని నిర్మాతను ప్రశ్నించారు. తాము పోలీసుల పర్మిషన్‌ తీసుకున్నామని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసుల అనుమతి కాదు.. స్థలం యజమాని అనుమతి కావాలని.. వక్ఫ్‌బోర్డ్‌ అనుమతి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ సలీమ్‌ మనుషులమని చెప్పారు. సలీమ్‌తో మాట్లాడించినట్టు ఫోన్‌లో ఎవరితోనే మాట్లాడించారు. 4 లక్షల వరకు డిమాండ్‌ చేసి, చివరికి 50 వేలకు బేరం కుదుర్చుకుని 50 వేలు వసూలు చేశారు.

దీనిపై బాధితుడు నార్సింగి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయట పడింది. అసలు తాను ఎవరితో ఫోన్‌లో మాట్లాడలేదని, దీనికి తనకు సంబంధం లేదని వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ సలీం తెలిపారు. దీంతో చీటింగ్‌ చేసి 50 వేలు ఎత్తుకెళ్లిన మోసగాళ్ల కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. ల్యాంకో హిల్స్‌ గుట్టపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

Read also: Online Dating app: ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా యువతితో వీడియో కాల్.. కట్ చేస్తే, ఘోరం !

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!