ఢిల్లీలో అక్రమ ఆయుధాల స్మగ్లింగ్‌.. వ్యక్తి అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దేశీ ఆయుధాలతో పాటు.. ఇతర సామాగ్రిని..

  • Tv9 Telugu
  • Publish Date - 6:55 am, Thu, 16 July 20
ఢిల్లీలో అక్రమ ఆయుధాల స్మగ్లింగ్‌.. వ్యక్తి అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దేశీ ఆయుధాలతో పాటు.. ఇతర సామాగ్రిని అతడి వద్ద గుర్తించారు. 13 రైఫిల్స్‌తో పాటు..125 క్యాట్రెడ్జ్‌లను సీజ్ చేశారు. నిందితుడిని విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్స్‌కి, క్రిమినల్స్‌కి ఆయుధాలను సరఫరా చేసేవాడని తేలింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు మేవాట్ ప్రాంతం కేంద్రంగా ఈ అక్రమాధాల దందా కొనసాగుతుందని తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.