ప్రేమను అంగీకరించలేదని.. తండ్రినే జైలుకు పంపిన కూతురు.. కట్ చేస్తే.. విచారణలో సంచలన నిజాలు.
తన ప్రేమను అంగీకరించలేదని తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది సదరు బాలిక. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి.
ప్రేమ.. ఒక మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ముఖ్యంగా తమ ప్రేమ కోసం కన్నవారిని ఎదురించేవారుంటారు. అదే తల్లిదండ్రుల కోసం ప్రేమను వదులుకున్న వారుంటారు. కానీ తన ప్రేమను కాదన్నాడని ప్రపంచంలో ఏ కూతురు చేయలేని పనిచేసింది ఓ అమ్మాయి. అడ్డు చెప్పాడని ఏకంగా కన్నతండ్రిపైనే సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు.. 5 సంవత్సరాలు జైలులో నరకయాతన అనుభవించేలా చేసింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను అంగీకరించలేదని తండ్రిపైనే అత్యాచార ఆరోపణలు చేసింది సదరు బాలిక. ఈ కేసులో అయిదున్నర సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ తండ్రి.
అంధేరీలోని డీఎన్ నగర్ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా. ప్రేమలో పడ్డ కూతురు.. ప్రియుడి వెంట తిరగడం ఆ తండ్రి కంటపడింది. ఇది నచ్చని ఆయన.. కుమార్తెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ అతడి మాటలను ఆమె బేఖాతరు చేసింది. దీంతో విసిగిపోయిన ఆ తండ్రి కోపంతో కూతురుపై చేయి చేసుకున్నాడు. పలుమార్లు తన వైఖరి మార్చుకోమని కొట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న బాలిక తనపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో తన స్కూల్ టీచరుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. సదరు టీచరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలిక తండ్రిని 2017లో అరెస్టు చేసిన పోలీసులు.. జైలుకు పంపించారు. అయితే, ఈ కేసులో పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. వైద్యపరీక్షలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడికాలేదు. బాలిక మానసిక పరిస్థితి బాగోలేక అలా చెప్పిందని తేలింది. దీంతో బాలిక తండ్రిని నిర్దోషిగా తేల్చిన కోర్టు, అతని విడుదల చేయాలని ఆదేశించింది. కూతురు ప్రేమకు అడ్డు చెప్పి దాదాపు ఐదున్నర ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు ఆ తండ్రి.