ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఫైర్.. రేవంత్ అరెస్టును ఖండించిన నేతలు..

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓ దుర్మార్గ పాలన నడుస్తోందన్నారు. ఓ ఎంపీని ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడమేంటంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓ నియంత్ర పాలన కొనసాగుతుందన్నారు. ప్రజాస్వామిక […]

ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ ఫైర్.. రేవంత్ అరెస్టును ఖండించిన నేతలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 05, 2020 | 9:37 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓ దుర్మార్గ పాలన నడుస్తోందన్నారు. ఓ ఎంపీని ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడమేంటంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓ నియంత్ర పాలన కొనసాగుతుందన్నారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై తమ గళాన్ని విప్పాలని.. ఇలాగే కొనసాగితే ఎవ్వరు మాట్లాడలేరన్నారు.

కాగా.. గురువారం సాయంత్రం రేవంత్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌజ్‌ సమీపంలో అనుమతి లేకుండా డ్రోన్‌లతో చిత్రీకరించిన విషయంలో రేవంత్ రెడ్డితో సహా.. ఎనిమిది మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.