సినీ న‌టి మాధవీ లతపై కేసు న‌మోదు

ప్ర‌ముఖ సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ పెట్టిందని.. వనస్థలి పురంకి చెందిన గోపికృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువ‌కుడు చేసిన కంప్లైంట్ తీసుకున్న...

సినీ న‌టి మాధవీ లతపై కేసు న‌మోదు

బీజేపీ నేత‌, ప్ర‌ముఖ సినీ నటి మాధవీ లతాపై కేసు నమోదు చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కామెంట్ పెట్టిందని.. వనస్థలి పురంకి చెందిన గోపికృష్ణ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువ‌కుడు చేసిన కంప్లైంట్ తీసుకున్న‌ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.. 295-A సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాను హిందువునని చెప్పుకునే మాధవీ లతా హిందువుల మీద ఎందుకు కామెంట్ చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. కాగా మాధ‌వీ ల‌త బీజేపీలో పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఈమె గుంటూరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది.

Also Read: 

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Click on your DTH Provider to Add TV9 Telugu