బుల్లెట్ కాస్ట్.. బాప్‌రే ఇంత చీపా..? రూ.25వేలకే..

కడప జిల్లా నందలూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా యువకులు బుల్లెట్‌ వెహికిల్‌తో దూసుకుపోతున్నారు. దాదాపు లక్షన్నర వరకు ఖరీదు చేస్తున్నఈ వాహనాలను ఇక్కడ మాత్రం అత్యంత చౌకగా లభ్యం కావడంతో అందరూ వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ అంతటి కాస్లీ వెహికిల్‌ ఇక్కడ మాత్రం ఎందుకంత చౌకగా లభిస్తుందనుకుంటున్నారా..? ఇక్కడే అసలు మర్మం దాగివుంది. కర్నాటక నుంచి కడప జిల్లాలోని నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్‌, పల్సర్‌ లాంటి బైకులు భారీగా దిగుమతి చేస్తోంది ఓ ముఠా..ఆ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 1:18 pm, Wed, 14 August 19
బుల్లెట్ కాస్ట్.. బాప్‌రే ఇంత చీపా..? రూ.25వేలకే..

కడప జిల్లా నందలూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా యువకులు బుల్లెట్‌ వెహికిల్‌తో దూసుకుపోతున్నారు. దాదాపు లక్షన్నర వరకు ఖరీదు చేస్తున్నఈ వాహనాలను ఇక్కడ మాత్రం అత్యంత చౌకగా లభ్యం కావడంతో అందరూ వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ అంతటి కాస్లీ వెహికిల్‌ ఇక్కడ మాత్రం ఎందుకంత చౌకగా లభిస్తుందనుకుంటున్నారా..? ఇక్కడే అసలు మర్మం దాగివుంది. కర్నాటక నుంచి కడప జిల్లాలోని నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్‌, పల్సర్‌ లాంటి బైకులు భారీగా దిగుమతి చేస్తోంది ఓ ముఠా..ఆ గ్యాంగ్‌ తీసుకువచ్చిన బైక్‌లను అతి తక్కువ ధరకు ..రూ. 25 వేల నుండి 50 వేల లోపుగానే అమాయకులకు అట్టగడుతున్నారు. ఖరీదైన వాహనాలు…కారు చౌకగా వస్తుండటంతో యువత ఎగబడి కొన్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రం నుంచి బుల్లెట్‌ వాహనాలను అక్రమంగా తరలించి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్ననందలూరు పోలీసులు..వీటి తరలింపు వెనక అసలు సూత్రదారి ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు