Love – Tragedy: ప్రేమ.. పెళ్లి ఎందుకు ట్రాజెడీగా మారింది.. ఆ నాలుగు గోడల మధ్య గొడవ అందుకే జరిగిందా..

హోటల్‌లో నాలుగు గోడల మధ్య ఏం జరిగింది? ప్రేమజంట.. పెళ్లి లైఫ్‌ ఎందుకు ట్రాజెడీగా మారింది? చంపేయాల్సిన అవసరమేంటి? చచ్చిపోయేందుకు దారి తీసిన పరిస్థితులేంటి? CC ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?

Love - Tragedy: ప్రేమ.. పెళ్లి ఎందుకు ట్రాజెడీగా మారింది.. ఆ నాలుగు గోడల మధ్య గొడవ అందుకే జరిగిందా..
Big Tragedy
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 30, 2021 | 11:10 AM

హోటల్‌లో నాలుగు గోడల మధ్య ఏం జరిగింది? ప్రేమజంట.. పెళ్లి లైఫ్‌ ఎందుకు ట్రాజెడీగా మారింది? చంపేయాల్సిన అవసరమేంటి? చచ్చిపోయేందుకు దారి తీసిన పరిస్థితులేంటి? CC ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు? పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తేలింది? హైదరాబాద్‌లో ప్రేమజంట సూసైడ్‌.. అనేక అనుమానాలకు దారితీసింది. పెద్దలను ఎదిరించి కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్న ప్రేమజంట హైదరాబాద్‌ లెమన్‌ ట్రీ హోటల్‌లో ఇద్దరు డెడ్‌బాడీలుగా కనిపించారు.

యువతిని బ్లేడుతో గొంతు కోసి బాత్రూంలో పడేసిన యువకుడు.. తర్వాత గదిలో ఉరి వేసుకొని సూసైడ్‌ చేసుకున్నాడు. మృతులు వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌ పేట మండలం హకీంపేటకు చెందిన సంతోషి, రాములు. పక్క పక్క గ్రామాలకు చెందిన వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.

దీంతో హైదరాబాద్‌ వచ్చిన రాములు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇంటిలో వీరి గురించి పెద్దలు మర్చిపోయారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ పేరెంట్స్‌కు హైదరాబాద్‌ నుంచి ఫోన్ వెళ్లింది. మీ పిల్లలు హోటల్‌లో చనిపోయారన్నది ఫోన్ సారాంశం. దీంతో రెండు కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. ఇంత దారుణంగా చనిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.హోటల్‌కు వెళ్లిన పోలీసులు బాత్రూంలో రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న సంతోషి డెడ్‌బాడీని చూశారు. అక్కడి నుంచి బెడ్‌ వరకు రక్తంతో కూడిన పాదాల గుర్తులు.., రక్తం చుక్కలను గుర్తించారు.

గదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు విచక్షణ కోల్పోయిన రాములు బ్లేడుతో సంతోషి గొంతు కోశాడని అనుమానిస్తున్నారు. తర్వాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

క్లూస్‌టీం బాత్రూమ్‌లో హత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. గదిలో సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, ఓ ప్రైవేట్‌ ENT ఆస్పత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్‌ కార్డులు లభించాయి.

ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..