B Pharmacy Student Suicide: చేవెళ్లలో దారుణం.. సెల్‌ఫోన్‌లో మాట్లాడొదన్నందుకు బీఫార్మసీ విద్యార్థిని..
B Pharmacy Student Suicide In Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దారుణం జరిగింది. తల్లి మందలించిందన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన..
B Pharmacy Student Suicide In Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో దారుణం జరిగింది. తల్లి మందలించిందన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన మండల పరిధిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల మండలంలోని పానెన గ్రామానికి చెందిన టి.శివ శంకర్, పుష్పలత దంపతుల కూతురు సుప్రియ (18) మోయినాబాద్‌లో ఓ కాలేజీలో బీఫార్మసీలో చదువుతోంది. ఇటీవల సుప్రియ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి పుష్పలత.. మొబైల్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడొద్దంటూ కూతురును బుధవారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై సుప్రియ.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. గదిలో నుంచి ఎంతకీ రాకపోవడాన్ని గమనించిన తల్లి లోపలికి వెళ్లి చూసింది. అయితే సుప్రియ అప్పటికే గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి సుప్రియను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువతి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జుట్టు రాలిపోతుందంటూ వచ్చి లేడీ డాక్టర్‌పై కన్నేసిన పేషెంట్.. ఏకంగా జీపీఎస్‌తో ట్రాకింగ్..