Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన.. ఏం కష్టమొచ్చిందో ఏమో కుటుంబం మొత్తం సూసైడ్.. వివరాలు ఇలా..

Family Committed Suicide West Godavari : పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగవరం గ్రామంలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన.. ఏం కష్టమొచ్చిందో ఏమో కుటుంబం మొత్తం సూసైడ్.. వివరాలు ఇలా..
Husband Kills Wife
Follow us
uppula Raju

|

Updated on: Mar 24, 2021 | 3:14 PM

Family Committed Suicide West Godavari : పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగవరం గ్రామంలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం గ్రామంలో నివసిస్తున్న భార్యాభర్తలు వెంకట నారాయణ, కృష్ణ తులసి , వారి కొడుకు భాను వికాస్. అయితే ఏం జరిగిందో ఏమో తెలియడం లేదు కానీ పంట పొలంలో కుటుంబ సభ్యులు అందరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు గల కారణాలు తెలియరావడం లేదు.

అయితే స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి తండ్రి చనిపోగా, అతడి భార్య, కొడుకుని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించే లోపే కొడుకు కూడా మృతిచెందాడు. ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న కృష్ణ తులసికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామస్థులను విచారిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా బెదిరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఏది ఏమైనా ఈ కుటుంబం ఇలా చేయడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Akash Puri : కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఆకాష్ పూరి సినిమా.. కీలక పాత్రలో శివగామి

మూడు వన్డేలతో అతడి కెరీర్ ముగిసినట్లేనా.. ఆ లెఫ్ట్‌హ్యాండ్ ధోని ప్రస్తుతం ఎక్కడ..? మీరే తెలుసుకోండి..

రచయితగా మారిన మ్యూజిక్ లెజెండ్ ఎ.ఆర్‌.రెహ‌మాన్.. త్వరలోనే `99 సాంగ్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు..