Atrocities: సిద్దిపేట జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల కూతురును రోకలిబండతో కొట్టి చంపిన తల్లి

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 07, 2021 | 10:16 AM

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నవ మాసాలు మోసి కని పెంచిన కన్న కూతురునే కడతేర్చింది ఓ కసాయి తల్లి.

Atrocities: సిద్దిపేట జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల కూతురును రోకలిబండతో కొట్టి చంపిన తల్లి
murder

Follow us on

Mother kills nine-year-old daughter: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నవ మాసాలు మోసి కని పెంచిన కన్న కూతురునే కడతేర్చింది ఓ కసాయి తల్లి. అక్కన్నపేట మండలం మల్చెరువు తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతురు భూక్య లావణ్య(9)ను తల్లి భూక్య రామీ రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి రామికి మతిభ్రమించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఆమె మానసికస్థితి సరిగాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also..  ఆటోలో ఫోర్న్ వీడియోలు చూస్తూ యువకుడి అసభ్య ప్రవర్తన.. చెప్పులతో కొట్టిన ఇద్దరు అమ్మాయిలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu