Parents kills Son: మద్యం మత్తులో కొడుకు వీరంగం.. కొత్త బైక్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై దాడి.. ఆ బాధను తట్టుకోలేక..!
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు తల్లిదండ్రులు హత్య చేయడం కలకలంరేపింది. కొడుకు వేధింపులు తట్టుకోలేక తండ్రి శివారెడ్డి, భార్యతో కలిసి కొడుకును హతమార్చారు.
Parents Kills Son: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు తల్లిదండ్రులు హత్య చేయడం కలకలంరేపింది. అమడగూరు మండలం మద్దెమ్మగుడిపల్లికి చెందిన శివారెడ్డి, భాగ్యమ్మలకు కుమారుడు ప్రతాప్‌రెడ్డి, కూతురు శశికళ సంతానం. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కుమారుడు ప్రతాప్‌రెడ్డి మాత్రం మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో 15 రోజులుగా కొత్త బైక్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు.. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, తర్వాత కొనిస్తామంటూ సర్థిచెప్పాలని చూసినా వారి మాట వినపించుకోలేదు.
ఇదే విషయానికి సంబంధించి కొడుకు బాధను భరించలేక తల్లిదండ్రులు కుమార్తెతో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డి గురువారం రాత్రి బైక్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులతో ఘర్షణకు దిగాడు. దీంతో ప్రతాప్ రెడ్డి తల్లి భాగ్యమ్మపై దాడి చేసి గాయపర్చాడు. స్థానికులు జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ప్రతాప్ రెడ్డి మళ్లీ అందరూ నిద్రిస్తున్న శుక్రవారం తెల్లవారుజామున మద్యం మత్తులో తల్లిని మరోసారి కొట్టాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తండ్రి శివారెడ్డి, భార్యతో కలిసికొడుకును ఇనుప రాడ్డుతో కొట్టారు. అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడి సోదరి శశికళ ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.