Andhra Pradesh: విజయవాడ ఎఫ్‌డీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మాయమైన డబ్బులు మళ్లీ ప్రత్యక్షం

విజయవాడ ఎఫ్‌డీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అకౌంట్‌లో మాయమైన డబ్బులు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఈ కేసుపై పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక విషయాలను రాబడుతోంది.

Andhra Pradesh: విజయవాడ ఎఫ్‌డీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మాయమైన డబ్బులు మళ్లీ ప్రత్యక్షం
Vijayawada Fd Scam

ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేష‌న్, ఏపీ ఆయిల్ ఫెడ్‌ల‌లో సుమారు 15 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు గల్లంత‌య్యాయి. ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సొసైటీ ఫెడరేషన్ తరపున మేనేజర్ రమణమూర్తి సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు. ఆత్కూరు పీఎస్‌లో ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామనీ.. మొత్తంగా 9.06కోట్లు పోయినట్లు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి ఫిర్యాదులు అందాయన్నారు. మొత్తం 14కోట్లకు సంబంధించిన స్కాంలో రెండు కేసులు ఒకేలా ఉన్నాయి. ఈ కేసులో తెలుగు అకాడమీ కేసు నిందితుల పాత్ర ఉన్నట్లు గుర్తించామనీ.. సిసియస్‌కి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు సీపీ. హైదరాబాదు అధికారులతో సమన్వయం చేసుకుని.. తెలుగు అకాడమీ ‌కేసు డాక్యుమెంట్లు కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. డీసీపీ హర్షవర్ధన్.. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తున్నామన్నారు సీపీ బత్తిన. డబ్బు బయటకు వెళ్లి..‌ మళ్లీ అకౌంటులోకి ఎలా వచ్చాయనేది కూడా పరిశీలిస్తోంది పోలీస్ డిపార్ట్ మెంట్.

అస‌లు ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకును ఎవ‌రు సిఫార్సు చేశారు, ఎవ‌రి స‌ల‌హాతో ఆ బ్యాంకులో నిధులు జ‌మ చేశారు. ఎవ‌రు సంత‌కం చేస్తే నిధులు వేరే ఖాతాల్లోకి మ‌ళ్లించారు. మళ్లీ తిరిగి అకౌంట్లలోకి డబ్బులు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. త్వరలోనే ఈ డీలింగ్ వెనుక ఎవరెవరి పాత్ర ఉందనేది తేల్చేస్తామంటున్నారు పోలీసులు.

Also Read: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. గేర్ మార్చిన టీఆర్‌ఎస్

పండుగ తర్వాత భారీ విద్యుత్ కోతలంటూ ఏపీలో ప్రచారం.. ఇందన శాఖ క్లారిటీ

 

Click on your DTH Provider to Add TV9 Telugu