Police Action: స్థానికులు ఏదో చేస్తే.. అంతకు మించిన వీరంగం చేశారు పోలీసులు.. అనంతలో వింతపోకడ

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో హల్ చల్ చేశాడు అస్లాం అనే వ్యక్తి . ఎస్కేడీ ఇంజనీరింగ్ కాలేజ్‌ వద్ద పలువురిపై దాడి చేశాడు. దీంతో అస్లాంను పట్టుకుని చితకబాదారు స్థానికులు. గతంలో కూడా

Police Action: స్థానికులు ఏదో చేస్తే.. అంతకు మించిన వీరంగం చేశారు పోలీసులు.. అనంతలో వింతపోకడ
Anantapur 2
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 17, 2021 | 9:48 PM

Anantapuram: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో హల్ చల్ చేశాడు అస్లాం అనే వ్యక్తి . ఎస్కేడీ ఇంజనీరింగ్ కాలేజ్‌ వద్ద పలువురిపై దాడి చేశాడు. దీంతో అస్లాంను పట్టుకుని చితకబాదారు స్థానికులు. గతంలో కూడా ఆస్పత్రిలో ఇతగాడు దాడులు చేసాడని చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అస్లాంకు మతి స్థిమితం లేక వింత ప్రవర్తిస్తున్నాడని మరికొంత మంది స్థానికులంటున్నారు.

కాగా గత రాత్రే అస్లాం గుత్తికి చేరుకున్నారు. రావడం రావడంతోటే గుత్తిలో వీరంగం చేశాడు. కనబడ్డవారిపై పిచ్చిగా ప్రవర్తిస్తూ.. దాడులు చేశాడు. దీంతో పోలీసులకు ఫోన్ చేశారు స్థానికులు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. వచ్చీ రావడంతోనే అతడ్ని అదుపులోకి తీసుకోకుండా.. అస్లాంను రక్తం వచ్చే విధంగా మరోమారు చితక్కొట్టారు.

అస్లాంకు మతిస్థిమితం లేకే .. ఇలా ప్రవర్తించినప్పుడు అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ ఇలా కొట్టడమేంటీ అని పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. పలువురు ప్రశ్నించడంతో.. గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి అస్లాంను తరలించారు పోలీసులు. తాళ్లతో కట్టివేసి గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో అస్లాంకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

Anantapuram

Anantapuram

Read also: సరిహద్దు ప్రాంతంపై ఒడిశా కన్ను.. సాలూరు పరిధిలోని 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిట పట్టాలని పన్నాగం