మారుతీరావు ఆత్మహత్యపై అమృత స్పందన ఇదే..
మారుతీరావు ఆత్మహత్యపై అతని కూతురు అమృత స్పందించింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం టీవీ ద్వారానే తెలిసిందని.. ఆయన మృతిపై తమకు ఇంకా కన్ఫర్మేషన్ లేదని తెలిపింది. హత్యనా.. ఆత్మహత్యానా అన్నది కూడా ఏం తెలియదని.. దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడుతానన్నారు. ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి తండ్రితో టచ్‌లో లేనన్న అమృత.. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని.. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తానని తెలిపింది. కాగా.. శనివారం రాత్రి […]
మారుతీరావు ఆత్మహత్యపై అతని కూతురు అమృత స్పందించింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం టీవీ ద్వారానే తెలిసిందని.. ఆయన మృతిపై తమకు ఇంకా కన్ఫర్మేషన్ లేదని తెలిపింది. హత్యనా.. ఆత్మహత్యానా అన్నది కూడా ఏం తెలియదని.. దీనిపై క్లారిటీ వచ్చాక మాట్లాడుతానన్నారు. ప్రణయ్ హత్య జరిగినప్పటి నుంచి తండ్రితో టచ్‌లో లేనన్న అమృత.. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని.. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తానని తెలిపింది.
కాగా.. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో బస చేసిన మారుతీరావు.. గదిలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మారుతీరావును చూసిన వైశ్య భవన్ సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.