AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACB trapped: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మేడిపల్లి ఎస్‌ఐ యాదగిరి రాజు

హైదరాబాద్‌ మహానగరంలోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు.

ACB trapped: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మేడిపల్లి ఎస్‌ఐ యాదగిరి రాజు
Arrest
Balaraju Goud
|

Updated on: Dec 07, 2021 | 8:29 PM

Share

ACB trapped: హైదరాబాద్‌ మహానగరంలోని మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ట్రాప్‌ చేసిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌లోనే రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నవంబర్ 28న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసులో ప్రశాంత్ అనే పిర్యాదుదారుడి నుండి లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు నేరుగా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా మరో బైక్ పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టి పారిపోయాడు. దీంతో శ్రీనివాస్ కాలుకి ఫ్యాక్చర్ కావడంతో శ్రీనివాస్ కుమారుడు ప్రశాంత్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ యాదగిరి రాజు పిర్యాదుదారుడు ప్రశాంత్ కు సర్టిఫికెట్స్ కోసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరగా పదివేల రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఐ యాదగిరి రాజు కోరగా, ప్రశాంత్ పది వేల రూపాయల నగదు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు ప్రశాంత్. ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఎస్ఐ యాదగిరి రాజుకు ప్రశాంత్ నగదు ఇస్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు.. మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also…  హైదరాబాద్ నడిబొడ్డున డెడ్‌బాడీ కలకలం.. ఓవర్ ‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం.. ఆందోళనలో స్థానికులు !