AP News: ఆ కారణంగానే భర్త గొంతు కోసిన భార్య.. రాడ్డుతో కట్టి హత్య..

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో ఎక్కువ శాతం భర్తలే భార్యలను హతమార్చిన సంఘటనలను చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం భార్య.. తన భర్తను గొంతు కోసి, రాడ్డుతో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. అటెండర్‎గా పనిచేస్తున్న నరసమ్మ తన భర్తను కడతేర్చింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తను.. భార్య హత్య చేసిన సంఘటన అక్కడి స్దానికులను కలిచివేస్తోంది.

AP News: ఆ కారణంగానే భర్త గొంతు కోసిన భార్య.. రాడ్డుతో కట్టి హత్య..
Wife Kills Husband
Follow us
Sudhir Chappidi

| Edited By: Srikar T

Updated on: Mar 13, 2024 | 12:02 PM

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్లో ఎక్కువ శాతం భర్తలే భార్యలను హతమార్చిన సంఘటనలను చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం భార్య.. తన భర్తను గొంతు కోసి, రాడ్డుతో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. అటెండర్‎గా పనిచేస్తున్న నరసమ్మ తన భర్తను కడతేర్చింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేటలో దారుణం చోటుచేసుకుంది. భర్తను.. భార్య హత్య చేసిన సంఘటన అక్కడి స్దానికులను కలిచివేస్తోంది. మృతుడు తిమ్మప్ప (46) నిందితురాలు నరసమ్మ ఏపీఎండిసిలో అటెండర్‎గా పనిచేస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని.. అలాగే నిన్న రాత్రి అంటే మంగళవారం కూడా భార్య నర్సమ్మను భర్త తిమ్మప్ప మద్యం సేవించి ఉరివేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు వస్తున్నాయి.

భర్త నిత్యం తాగి వచ్చి తనను చిత్రహింసలకు గురిచేసేవాడని తెలుస్తోంది. వాటిని ఎంతోకాలం ఓపికగా సహించిన నరసమ్మకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. దీంతో నిన్న రాత్రి రోజూ లాగానే మద్యం సేవించి వచ్చిన తిమ్మప్ప గొడవపడి భార్యను ఉరివేసే ప్రయత్నం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు లోనైన నరసమ్మ.. ఆవేశం తట్టుకోలేక భర్తను గొంతు కోసి, రాడ్డుతో కొట్టి చంపిందని స్థానికులు చెబుతున్న సమాచారం. అయితే నరసమ్మ రోజు తన పడుతున్న బాధలను తట్టుకోలేక ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా తాగుబోతు భర్త నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే హత్య చేసినట్లు చెబుతోంది భార్య. మొత్తం మీద తనను చంపబోయిన భర్తను నరసమ్మ గొంతు కోసి, రాడుతో కొట్టి హత్య చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారో చూడాల్సివుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..