Jammu Kashmir: అనంతనాగ్‌లో జాయింట్ ఆపరేషన్.. భారీగా పులి చర్మాలు, జంతు అవశేషాలు స్వాధీనం..

జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు, పలు శాఖల అధికారులు భారీ స్మగ్లింగ్‌ను బట్టబయలు చేశారు. భారీగా పులి చర్మాలతోపాటు..

  • Shaik Madarsaheb
  • Publish Date - 3:54 pm, Sat, 30 January 21
Jammu Kashmir: అనంతనాగ్‌లో జాయింట్ ఆపరేషన్.. భారీగా పులి చర్మాలు, జంతు అవశేషాలు స్వాధీనం..

Jammu Kashmir Anantnag: జమ్మూ కాశ్మీర్‌లో పోలీసులు, పలు శాఖల అధికారులు భారీ స్మగ్లింగ్‌ను బట్టబయలు చేశారు. భారీగా పులి చర్మాలతోపాటు పలు జంతువుల అవశేషాలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగింది. సమాచారం మేరకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, అటవీశాఖ, అనంతనాగ్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్త బృందం అనంతనాగ్‌లో శనివారం దాడులు నిర్వహించాయి. దీంతో ఓ ఇంట్లో భారీగా ఉంచిన 8 చిరుత పులి చర్మాలు, 38 ఎలుగుబంటి పిత్తాశయాలు, 4 మస్క్ డీర్ పాడ్స్‌లను ఆయా శాఖల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీటిని కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Honour killing: ప్రేమ జంటపై పాశవికంగా దాడి.. హత్య చేసి.. ఆపై చెట్టుకు వేలాడదీసిన బాలిక బంధువులు