బెంగాల్‌లో సేమ్ వార్ సీన్.. ఘర్షణల్లో ఐదుగురు మృతి

వెస్ట్ బెంగాల్‌లో మరోసారి రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న టీఎంసీ – బీజేపీ వార్.. రోజురోజుకు ముదురుతోంది. ఫలితాలు వచ్చిన అనంతరం పలు జిల్లాల్లో జరిగిన ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రాణాలు వదిలారు. కాగా, శనివారం రాత్రి.. 24 పరగాణాల జిల్లాలో మరోసారి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఒకరు తృణమూల్‌కు చెందిన వ్యక్తి కాగా మరో […]

బెంగాల్‌లో సేమ్ వార్ సీన్.. ఘర్షణల్లో ఐదుగురు మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 09, 2019 | 11:10 AM

వెస్ట్ బెంగాల్‌లో మరోసారి రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కొనసాగుతున్న టీఎంసీ – బీజేపీ వార్.. రోజురోజుకు ముదురుతోంది. ఫలితాలు వచ్చిన అనంతరం పలు జిల్లాల్లో జరిగిన ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రాణాలు వదిలారు. కాగా, శనివారం రాత్రి.. 24 పరగాణాల జిల్లాలో మరోసారి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ఒకరు తృణమూల్‌కు చెందిన వ్యక్తి కాగా మరో నలుగురు బీజేపీకి చెందినవారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీ జెండాలను తొలగించిన విషయంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్త.. ఘర్షణకు దారితీయడంతో.. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని.. శాంతి భద్రతలను పర్యవేక్షించారు.కాగా, జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్రం నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.