Road Accident: నిమజ్జనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. పలువురికి..

Khammam Road Accident: దేవి నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో

Road Accident: నిమజ్జనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. పలువురికి..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2021 | 6:41 AM

Khammam Road Accident: దేవి నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాల్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ముదిగొండ పోలీసులు వెల్లడించారు.

మండలంలోని కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నది వద్దకు బయలు దేరారు. ఈ క్రమంలో ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో కొంతమంది గ్రామస్థులు, యువకులు ప్రయాణిస్తున్నారు. అయితే.. విగ్రహం ఉన్న ట్రాక్టర్‌ మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకవైపు ఉన్న మరో ట్రాక్టర్‌ వల్లభి వైపు వెళ్లింది.

వర్షం కురుస్తుండటంతో ట్రాక్టర్ అయ్యగారిపల్లి వద్ద ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారందరినీ.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదంలో కమలాపురం గ్రామానికి చెందిన ఆవాసాన్ని ఉపేంద్ర(35) ములకలపల్లి ఉమ(27 ) చోడబోయిన నాగరాజు(27) బిచ్చలా వెలగొండ స్వామి(54) మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read:

Crime News: అమలాపురంలో దారుణం.. నడిరోడ్డుపై మహిళ మెడలో నగలు లాక్కెళ్లిన దుండగుడు

Andhra Pradesh: విజయవాడ ఎఫ్‌డీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మాయమైన డబ్బులు మళ్లీ ప్రత్యక్షం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?