Crime News: అమలాపురంలో దారుణం.. నడిరోడ్డుపై మహిళ మెడలో నగలు లాక్కెళ్లిన దుండగుడు

ఈమధ్య చైన్ స్నాచింగ్‎లు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్న స్నాచర్లు క్షణల వ్యవధిలో బంగారం లాక్కెళ్తున్నారు. బాధితులు తెరుకునే లోపే తప్పించుకుంటున్నారు...

Crime News: అమలాపురంలో దారుణం.. నడిరోడ్డుపై మహిళ మెడలో నగలు లాక్కెళ్లిన దుండగుడు
Amalapuram
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 16, 2021 | 9:50 PM

ఈమధ్య చైన్ స్నాచింగ్‎లు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్న స్నాచర్లు క్షణల వ్యవధిలో బంగారం లాక్కెళ్తున్నారు. బాధితులు తెరుకునే లోపే తప్పించుకుంటున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో గుర్తుతెలియని దుండగుడు నడిరోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి నగలు లాక్కెళ్లారు. ఆ మహిళ బోడపాలెం నుండి అమలాపురానికి పెళ్లికి వచ్చింది. ఆమె అమలాపురం కూచిమంచి ఆగ్రహం వద్ద నడిచి వెళ్లతుండగా వెనుక నుండి వచ్చిన దుండగుడు నగలు లాక్కెళ్లాడు.

నల్లపూసలు, తాళిబొట్టు, గొలుసు అంతా కలిపి సుమారు 16 కాసుల బంగారం లాక్కెళ్లినట్ల బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈరోజు అమలాపురంలో దసరా ఉత్సవాలలో భాగంగా ముగ్గురు డీఎస్పీలు, 10 సీఐలు 400 మంది పోలీసులు, పట్టణం అంతా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినా నడి రోడ్డుపై మహిళ మెడలో నుండి నగలు లాక్కెళ్లడంతో విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దండగుడిని పట్టుకునే పనిలో పడ్డారు. సీసీ ఫుటెజీ పరిశీలిస్తున్నారు. పాత నేరస్తుల గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also.. Andhra Pradesh: విజయవాడ ఎఫ్‌డీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. మాయమైన డబ్బులు మళ్లీ ప్రత్యక్షం