గుజరాత్‌లో భారీ ప్రమాదం.. ఓన్‌జీసీ పైపులైన్ పేలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓన్‌జీసీ పైపులైన్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓన్‌జీసీ పైపులైన్ పేలి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నాలుగు గాయపడ్డారు. తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. భారీగా పేలుడు శబ్దం రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పేలుడుగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.